Nizamabad: డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్ స్టూడెంట్స్

నిజామాబాద్ జిల్లాలో చదువు విషయంలో గొడవపడి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని జూనియర్ విద్యార్థులు హత్య చేశారు.

By అంజి  Published on  4 March 2024 12:37 PM IST
Student murdered by juniors in Nizamabad district

Nizamabad: డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్ స్టూడెంట్స్

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చదువు విషయంలో గొడవపడి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని జూనియర్ విద్యార్థులు హత్య చేశారు. ఆదివారం రాత్రి బోధన్ పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్‌లో వెంకట్ (19)పై కొందరు ఇంటర్మీడియట్ (11, 12వ తరగతి) విద్యార్థులు దాడి చేశారు. అదే జిల్లా గాంధారి మండలం తిప్పరి తండాకు చెందిన వెంకట్‌ బోధన్‌లోని బీసీ హాస్టల్‌లో ఉంటూ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నాడు. నిందితులు వెంకట్‌ను గదిలో బంధించి భౌతికంగా దాడి చేసి హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జూనియర్‌ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని వెంకట్‌ సూచించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

వెంకట్‌ 'స్టడీ అవర్‌ ఇన్‌చార్జి' కావడంతో విద్యార్థులను చాటింగ్‌లు మానేసి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆ సలహాపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు వాగ్వాదానికి దిగి అతడిని కొట్టారు. వారు అతనిని గొంతు నులిమి చంపారు. కొందరు హాస్టల్ విద్యార్థులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో పాల్గొన్న కనీసం ఆరుగురు విద్యార్థులు పోలీసుల అదుపులో ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story