మెడికల్‌ కాలేజీలో విద్యార్థి మృతదేహం.. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ..

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థిని 30 ఏళ్ల అమిత్ కుమార్‌గా గుర్తించారు.

By అంజి  Published on  28 Aug 2024 10:45 AM IST
Student found dead, Delhi, Maulana Azad Medical College,  Crime

మెడికల్‌ కాలేజీలో విద్యార్థి మృతదేహం.. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ..

ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థిని 30 ఏళ్ల అమిత్ కుమార్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న అమిత్ కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. అతను మానసిక రుగ్మతతో చికిత్స పొందుతున్నాడని, అతని గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసు అధికారి తెలిపారు.

బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాజరు సమస్యతో డీన్ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆగస్టు 1వ తేదీన జరిగింది. విద్యార్థి జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు.

Next Story