ఐఐటీ బాంబేలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలేమిటి..?

Student Dies In IIT Bombay. ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్న 18 ఏళ్ల విద్యార్థి

By M.S.R  Published on  13 Feb 2023 8:22 PM IST
ఐఐటీ బాంబేలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలేమిటి..?

ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్న 18 ఏళ్ల విద్యార్థి క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఘ‌ట‌నాస్థ‌లిలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. మృతుడిని అహ్మ‌దాబాద్‌కు చెందిన ద‌ర్శ‌న్ సోలంకిగా పోలీసులు గుర్తించారు. ద‌ర్శ‌న్ శ‌నివార‌మే త‌న మొద‌టి సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

క్యాంపస్‌లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల పట్ల వివక్ష కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డారని విద్యార్థి సంఘం ఆరోపించింది. దర్శన్ సోలంకి అనే బీటెక్ విద్యార్థి అహ్మదాబాద్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు. అతను మూడు నెలల క్రితం జాయిన్ అయ్యాడు. అతని మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. చదువుల ఒత్తిడి వల్లే ఆ విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడా..? అని పొవాయ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుభాసిస్ చౌధురి రిలీజ్ చేసిన నోట్ లో "మొదటి సంవత్సరం విద్యార్థిని కోల్పోయిన విషయాన్ని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము. పోవై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఆ కుటుంబానికి ఈ నష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము." అని తెలిపారు.

Next Story