ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. లైంగిక వేధింపులు భరించలేకపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌

Student commits suicide over sexual harrassment, leaves suicide note. లైంగిక వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  20 Feb 2022 7:40 AM GMT
ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. లైంగిక వేధింపులు భరించలేకపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌

లైంగిక వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం నాగర్‌కోయిల్ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన లింగారాం లక్ష్మయ్య, సువర్ణ దంపతుల రెండో కుమారుడు వంశీకృష్ణ. హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి వసతి గృహంలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు.

అనంతరం గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో విద్యార్థి తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులకు అనుమానం వచ్చింది. అయితే బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి చూడగా వంశీకృష్ణ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వంశీకృష్ణ బ్యాగులో రెండు సూసైడ్ లెటర్లు లభ్యమయ్యాయి. తనను లైంగికంగా వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

Next Story