తల్లితో సహజీవనం.. కూతురిపై లైంగిక వేధింపులు

నేటి సమాజంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వావి వరుసలు మరిచిపోయి కామ దాహంతో ఆడపిల్ల కనిపించిందంటే చాలు కాటు వేసి బలి చేస్తున్నారు.

By అంజి  Published on  16 July 2023 12:18 PM IST
Stepfather, Hyderabad, Crime news, SRnagar

తల్లితో సహజీవనం.. కూతురిపై లైంగిక వేధింపులు 

నేటి సమాజంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వావి వరుసలు మరిచిపోయి కామ దాహంతో ఆడపిల్ల కనిపించిందంటే చాలు కాటు వేసి బలి చేస్తున్నారు. ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ య్యాయి.. ఓ ప్రబుద్ధుడు తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతురుపై కన్నేశాడు. ఆ అమ్మాయిని ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ అమానుషమైన సంఘటన హైదరాబాద్‌ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళ తన కూతురితో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఒంటరిగా జీవిస్తున్న ఆ మహిళపై దుర్బుద్ధి ఉన్న నాగరాజు అనే వ్యక్తి కన్ను పడింది. దీంతో నాగరాజు ఆ మహిళకు మాయ మాటలు చెప్పి మచ్చిగా చేసుకుని తన మాయాజాల బుట్టలో పడేసాడు.

అతని తీయటి మాటలు నమ్మిన ఆ మహిళ అతని బుట్టలో పడిపోయింది. అతని మోసపూరిత మాటలు నిజమని నమ్మింది. అతని మాయాజాలంలో చిక్కు కున్న ఆ మహిళ అతని పూర్తిగా నమ్మింది. అనంతరం ఆ మహిళ నాగరాజుతో కలిసి సహ జీవనం కొనసాగించింది. అయితే ఈ కామాంధుడు తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకు పోయిన అతడు.. మహిళ కూతుర్ని లైంగిక వేధింపులకు గురి చేశాడు. మహిళ ఇంట్లో లేని సమయంలో ఈ ప్రబుద్ధుడు ఆమె కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. రోజురోజుకీ అతని వేధింపులు మితిమీరి పోవడంతో అమ్మాయి భరించలేక తన తల్లికి అతడి గురించి చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైనా మహిళ తన కూతుర్ని తీసుకుని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story