కన్నతండ్రి చేతిలో టెన్నిస్‌ క్రీడాకారిణి దారుణ హత్య

25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

By Medi Samrat
Published on : 10 July 2025 7:07 PM IST

కన్నతండ్రి చేతిలో టెన్నిస్‌ క్రీడాకారిణి దారుణ హత్య

25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సెక్టార్ 57లోని నివాసంలో మొదటి అంతస్తులో జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నిందితుడైన తండ్రి తన కుమార్తె రాధికపై మూడు బుల్లెట్లను పేల్చాడు. యువ అథ్లెట్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స సమయంలో ఆమె మరణించింది.

రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ సర్క్యూట్లలో సుపరిచితమైన పేరు. అనేక పతకాలు గెలుచుకుంది. ఆమె లాన్ టెన్నిస్ క్రీడాకారిణి, టెన్నిస్ అకాడమీని నడుపుతూ ఆమె ఇతర ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ ఉంది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. రివాల్వర్‌ను ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story