Telangana: తల్లిదండ్రుల గొడవ..మనస్తాపంతో ఉరేసుకున్న 13 ఏళ్ల కొడుకు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది
By - Knakam Karthik |
Telangana: తల్లిదండ్రుల గొడవ..మనస్తాపంతో ఉరేసుకున్న 13 ఏళ్ల కొడుకు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన ఓ కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రథాల పంపు ఏరియా లో అద్దెకు ఉంటున్న రవీందర్, అపర్ణ దంపతుల కుమారుడు విరాట్ (13) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తండ్రి హైదరాబాదులో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తుండగా తల్లి గృహిణి.
అయితే ఈ దంపతుల మధ్య తరచుగా గొడవ జరుగుతుండేది. శనివారం రాత్రి కూడా తల్లిదండ్రుల మధ్య గొడవ జరుగుతుండడంతో ఇంట్లో ఉన్న కొడుకు మనస్థాపానికి గురై ఇంట్లోని బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు తలుపు తీయాలని ఎంత కోరినా తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తీసేసరికి విరాట్ ఉరివేసుకొని ఉన్నాడు. వెంటనే బాలుడిని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..