మద్యం మత్తులో సవతి తల్లిపై కొడుకు అత్యాచారం
Son assaults stepmother in drunkenness.. Incident in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు తన సవతి
By అంజి Published on 6 Feb 2023 8:19 AM IST
ఉత్తరప్రదేశ్‌లోని బండాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాదు తల్లి అడ్డు చెప్పినా వినలేదు. కొడుకు తన సవతి తల్లిని తీవ్రంగా కొట్టి, అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ఈ కేసు అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించినది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యాచార ఘటనను బాధితురాలి తల్లి తన కూతురితో ప్రస్తావించింది. వెంటనే తల్లిని ఆస్పత్రికి తరలించిన కూతురు పోలీసులకు సమాచారం అందించింది. తన భర్త రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని మహిళ చెప్పింది. మొదటి భార్య, అతను సమీపంలో నివసిస్తున్నారు. నిందిత యువకుడు మొదటి భార్య కుమారుడు. అతను కూడా వారి ఇంటి పక్కనే ఉంటున్నాడు. ఆదివారం మద్యం తాగి ఆమె ఇంటికి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆమెపై అత్యాచారం చేసే సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అత్యాచారం అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు
తమ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తున్న ఒక మహిళ తన సవతి కుమారుడిపై అత్యాచారం, దాడి కేసు నమోదు చేసిందని అటార్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనూప్ దూబే తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళకు వైద్యం అందిస్తున్నారు. అదే సమయంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.