ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచాడు. ఆమె అతడి ప్లాట్‌కు వచ్చిన తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ అతడు 20వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 26 ఏళ్ల నమన్ నోయిడాలోని సెక్టార్-168లోని గోల్డెన్ పామ్ సొసైటీలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి ఆహ్వానించాడు. అయితే.. రాత్రి 10 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ 20వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతడు భవనం పై నుంచి కిందకు దూకే సమయంలో అతడి గర్ల్‌ఫ్రెండ్ అపార్టుమెంట్‌లోనే ఉంది. ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
కాగా.. యువతి, యువకుడు మద్యం సేవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మద్యం మోతాదు ఎక్కువై కిందపడి మరణించాడా..? లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.