Hyderabad: వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.

By -  Knakam Karthik
Published on : 5 Feb 2026 10:59 AM IST

Crime News, Hyderabad, Miyapur, Software engineer Suicide, work pressure, IT Employee

Hyderabad: వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు పని ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం తిలకుప్ప ప్రాంతానికి చెందిన స్వామి నాయుడు శ్రీదేవి దంపతుల కుమారుడు సతీష్ (31) మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బికే ఎంక్లేవ్ లో నివాసముంటూ గచ్చిబౌలిలోని ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు..అయితే ఇతనికి సంవత్సరం క్రితం రవళి అనే యువతితో వివాహం జరిగింది. భార్య రవళి సంక్రాంతి పండుగ సందర్భంగా తన సొంత ఊరికి వెళ్లిపోవడంతో సతీష్ తన తమ్ముడితో కలిసి తన నివాసంలో ఉంటున్నాడు.

అయితే ఉదయం తన అన్న నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చి తమ్ముడు పలుమార్లు డోర్ కొట్టాడు అయినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అన్న సతీష్ వదిన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. అప్పటికే అతను మృతి చెందినట్లుగా గుర్తించిన తమ్ముడు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. పని ఒత్తిడి మానసిక ఆందోళన కారణంగానే ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story