హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర బాబును గురువారం సాయంత్రం కిడ్నాప్ చేశారు.

By Medi Samrat  Published on  5 Jan 2024 8:38 PM IST
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర బాబును గురువారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేర్ ఆసుపత్రి వద్ద కిడ్నాప్ జరిగింది. కారులో వచ్చిన దుండగులు బాధితుడిని తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసిన దుండగులు సదరు ఉద్యోగి భార్యకు ఫోన్ చేసి రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి భార్యకు వీరు వైఫై కాల్స్ చేశారు. గుర్రం సురేంద్ర బాబు తన కుటుంబంతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్నారు. కిడ్నాప్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

రోజులాగే శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లిగా.. లుంబినీ పెట్రోల్ బంక్ ముందు ఆగిన అతన్ని కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సురేందర్ భార్యకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు సురేందర్ భార్య రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

Next Story