క్రికెట్ ఆడుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Software employee died in Hyderabad While playing cricket.రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 Aug 2022 12:26 PM IST

క్రికెట్ ఆడుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మ‌ర‌ణించాడు.

వివ‌రాల్లోకి వెళితే.. గుజ‌రాత్‌కు చెందిన తుస్సార్ అనే వ్య‌క్తి న‌గ‌రంలోని ఓ సంస్థ‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని స‌న్‌సిటీ ఎస్‌బీఐ గ్రౌండ్‌లో బుధ‌వారం తుస్సార్ క్రికెట్ ఆడుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. తోటి స్నేహితులు, స్థానికులు ఆయ‌న్ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. చికిత్స పొందుతూ తుస్సార్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గుండెపోటుతో మ‌ర‌ణించి ఉంటాడ‌ని బావిస్తున్నారు.

Next Story