Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి.. విషం తాగి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
By అంజి Published on 26 March 2023 10:15 AM ISTHyderabad: ఇద్దరు పిల్లలను చంపి.. విషం తాగి దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని కందిగూడలో చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్నామని, అయితే శనివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
సతీష్ అనే వ్యక్తికి భార్య వేద, ఇద్దరు పిల్లలు నిషికేత్ (9), నిహాల్ (5) ఉన్నారు. పిల్లలకు ముందుగా సైనేడ్ ఇచ్చి, ఆ తర్వాత దంపతులిద్దరూ కూడా అదే సైనేడ్‌ను తీసుకున్నారు. పిల్లలిద్దరూ ఆరోగ్య సమస్యలతో (మానసికంగా) బాధపడుతున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చికిత్స అనంతరం కూడా చిన్నారులు కోలుకోలేదు. పిల్లల బాధలను కళ్లారా చూడలేక తల్లిదండ్రులు మనస్తాపానికి గురై (కుటుంబం) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. మృతుల మృతదేహాలను మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదని, ఈ విషయమై బాధిత కుటుంబం తరపున ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీస్ స్టేషన్ చీఫ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.