కలకలం.. పాడుబడ్డ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా సమాచారం.
By అంజి Published on 29 Dec 2023 7:08 AM GMTకలకలం.. పాడుబడ్డ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా సమాచారం. ఆ కుటుంబం పూర్తిగా ఏకాంత జీవితం గడిపిందని, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండేవారని బంధువులు పోలీసులకు తెలిపారు. కుటుంబంలోని ఐదుగురు చివరిసారిగా జూలై 2019లో కనిపించారు. అప్పటి వారుంటున్న ఆ ఇంటికి తాళం వేసి ఉంది. సుమారు రెండు నెలల క్రితం, ఉదయం షికారు చేస్తున్న సమయంలో స్థానికులు ఇంటి యొక్క ప్రధాన చెక్క తలుపు పగిలిపోయి ఉండటాన్ని గమనించారు, అయినప్పటికీ వారు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.
అయితే తాజాగా ఇంట్లో ఐదు అస్థిపంజరాలను పోలీసులు గుర్తించారు. పాడుబడ్డ ఇంట్లో పలు అనుమానాస్పద అంశాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు), మరో గదిలో మరో అస్థిపంజరం కనిపించాయి. దేవెంగెరె నుండి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్‌ఓసిఓలు) సాక్ష్యాలను సేకరించడానికి పిలిపించారు. ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
పరిచయస్తులు, బంధువులు, కుటుంబ చరిత్ర నుండి వచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అంచనాల ప్రకారం, అవశేషాలు దంపతులు, వారి కుమారుడు, కుమార్తె, మనవడివి అని అనుమానిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ నివేదికల అనంతరం మృతుల వివరాలు వెల్లడి కానున్నాయి. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.