ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం.. మృతుల్లో చిన్నారి

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2023 5:56 AM GMT
Road Accident in Tiruchi district, Minivan Truck collision

ఘ‌ట‌నాస్థ‌లంలో త్రిచి పోలీసులు

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మినీ వ్యాన్ ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో చిన్నారి సహా ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. త్రిచి-సాలెం జాతీయ రహదారిపై తిరువాసి సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ముందు వెలుతున్న వ్యాన్‌ను లారీ ఢీ కొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఒక మ‌హిళ ఉన్నారు. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాల‌ను పోస్ట్ మార్టం నిమిత్తం త్రిచి ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it