వేధింపులు త‌ట్టుకోలేక‌.. 6 గురు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసిన త‌ల్లి

Six Children Dead After Mother Throws Them Into Well In Maharashtra.కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఓ మ‌హిళ దారుణ నిర్ణ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 12:25 PM IST
వేధింపులు త‌ట్టుకోలేక‌.. 6 గురు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసిన త‌ల్లి

కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఓ మ‌హిళ దారుణ నిర్ణ‌యం తీసుకుంది. ఆరుగురు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి అనంత‌రం ఆమె ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రాయ్‌గ‌ఢ్ జిల్లా ఖ‌ర్‌వాలీ గ్రామంలో 30ఏళ్ల రూనా సహానీ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. భ‌ర్త మ‌ద్యానికి బానిస కావ‌డం, అత్తింటి వారికి ఆమెకు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌డంతో రుహానీ తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది. ఈ క్ర‌మంలో ఓక‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. త‌న ఆరుగురు పిల్ల‌ల‌ను సోమ‌వారం మ‌ధ్యాహ్నాం బావిలోకి తోసేసింది.

అనంత‌రం తాను అదే బావిలోకి దూకింది. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే బావిలోకి దూకి వారిని పైకి తీసుకువ‌చ్చారు. అయితే.. అప్ప‌టికే చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. మ‌హిళ‌కు ప్రాణాపాయం త‌ప్పింది. మృతుల్లో ఒక బాబు, ఐదుగురు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. వీరంతా 18 నెల‌ల నుంచి 10 సంవత్స‌రాల లోపు వారే. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story