నేటి జనరేషన్‌లో ప్రేమే సర్వస్వం అన్నట్లు వ్యవహరిస్తోంది యువత. ప్రేమను దక్కించుకునేందుకు కొందరైతే దారుణాలకు తెగబడుతున్నారు. ఇంకొందరు ప్రేమ పేరుతో ప్రాణాలను తీసుకుంటున్నారు, తీస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘోరమే మహారాష్ట్రలో జరిగింది. తమ ప్రేమ వ్యవహారం చూశాడని ప్రియుడితో కలిసి తమ్ముడిని అతిదారుణంగా హత్య చేసింది ఓ అక్కా. పూర్తి వివరాల్లోకి వెళ్తే... నాగ్‌పూర్‌లో ఓ యువతి ప్రేవ వ్యవహారం నడుపుతోంది. ఇటీవల ఇంట్లో కుటుంబసభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది.

ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా.. తమ్ముడు ఇంటికి వచ్చాడు. దీంతో షాక్‌ తిన్న ఆ యువతి.. తమ వ్యవహారం బయటపడుతుందేమోనని ఆందోళనకు గురైంది. తమ బండారాన్ని తమ్ముడు ఎలాగైన తల్లిదండ్రులకు చెబుతాడని, తమ్ముడిని అంతమొందిస్తే తప్ప విషయం బయటకు రాదని చాలా దారుణంగా ఆలోచించింది. తన ప్రియుడితో కలిసి తమ్ముడిని అతి దారుణంగా గొంతు పిసికి హత్య చేసింది. కొడుకు మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో యువతిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story