కోడికూర వండలేదని.. సొంత చెల్లిని గొడ్డలితో నరికి చంపిన అన్న

Sister killed brother in fight for chicken curry in east godavari. ఇటీవల కాలంలో క్రైమ్‌ రేట్‌ బాగా పెరిగిపోతోంది. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకే

By అంజి  Published on  5 March 2022 5:22 AM GMT
కోడికూర వండలేదని.. సొంత చెల్లిని గొడ్డలితో నరికి చంపిన అన్న

ఇటీవల కాలంలో క్రైమ్‌ రేట్‌ బాగా పెరిగిపోతోంది. క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు కొందరు. చిన్న చిన్న విషయాలకే గొడవపడుతూ ప్రాణాలు తీస్తున్నారు. సొంత, పరాయి అన్న బేధం లేకుండా విచక్షణారహితంగా క్రైమ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కోడికూర వండలేదని సొంత చెల్లిని చంపాడు ఓ అన్న. ఈ దారుణ ఘటన కూనవరం మండలం కన్నాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అన్న నందను చూసేందుకు వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో ఉంటున్న చెల్లెలు సోమమ్మ (20) కన్నపురం వచ్చింది. చెల్లెలు వచ్చింది కదా.. రెండు రోజుల్లో వస్తానంటూ నంద భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం నాడు రాత్రి ఫూటుగా మద్యం సేవించిన నంద.. చికెన్‌ తీసుకుని ఇంటికి వచ్చాడు. చికెన్‌ కర్రీ వండాలంటూ సోమమ్మను కోరాడు.

అయితే సోమమ్మ.. తనకు నీరసంగా ఉందని చెప్పింది. దీంతో నంద సోమమ్మతో గొడవపడుతూ ఇంటి నుండి బయటకు వెళ్తూ.. ఇంటికొచ్చేసరికి చికెన్‌ కర్రీ వండాలంటూ చెప్పి పోయాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన నంద.. కోడికూరతో అన్నం వడ్డించాలని సోమమ్మను అడిగాడు. అయితే ఆమె కోడి కూర వండలేదని దాడి చేయడంతో.. సోమమ్మ అరుపులు, కేకలు పెడుతూ ఇంటి నుండి బయటకు పరుగులు తీసింది. ఆమెను వెంబడించి పట్టుకుని గొడ్డలితో నరికాడు. చుట్టు పక్కల వారు అందరూ అక్కడి చేరుకునే లోపే రక్తపుమడుగులో పడి ఉన్న సోమమ్మ కోన ఊపిరితో ప్రాణాలు విడిచింది. నిందితుడిని పట్టుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it