బోనీ కపూర్ కారులో వెండి సామాన్లు

Silver items worth ₹39 lakh belonging to Boney Kapoor seized in Karnataka. శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని దావణగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని

By M.S.R  Published on  8 April 2023 2:44 PM IST
బోనీ కపూర్ కారులో వెండి సామాన్లు

శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలోని దావణగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన రూ. 39 లక్షల విలువైన 66 కిలోల వెండి వస్తువులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వాధీనం చేసుకుంది. చెన్నై నుంచి ముంబైకి బీఎండబ్ల్యూ కారులో ఐదు బాక్సుల్లో సరైన పత్రాలు లేకుండా వెండి సామాగ్రిని తరలిస్తూ ఉండగా అధికారులు అడ్డుకున్నారు.

66 కిలోల వెండి వస్తువులను ఎన్నికల కమిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.39 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా ఐదు బాక్సుల్లో ఈ వెండి వస్తువులను ప్యాక్ చేసి, బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఈసీ నిఘాను విస్తృతం చేసింది. వెండి పాత్రలు, స్పూన్లు, మగ్గులు, ప్లేట్లు తదితర వస్తువులు వీటిలో ఉన్నాయి. ఈసీ అధికారులు వీటిని సీజ్ చేశారు. కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తోపాటు, కారులో ఉన్న హరి సింగ్ పై దావణగిరె పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో ఈ కారు బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసింది. ఈ సంస్థ బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కు చెందినది. వెండి వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవిగా విచారణలో హరి సింగ్ ఒప్పుకున్నాడు. డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.


Next Story