మారేడుపల్లి ఎస్సైని కత్తితో పొడిచిన దుండగుడు

SI Vinay kumar attacked by unknown in marredpally in hyderabad. హైదరాబాద్‌ నగరంలోని మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై వినయ్‌కుమార్‌పై ఇద్దరు దుండగులు

By అంజి  Published on  3 Aug 2022 10:02 AM IST
మారేడుపల్లి ఎస్సైని కత్తితో పొడిచిన దుండగుడు

హైదరాబాద్‌ నగరంలోని మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై వినయ్‌కుమార్‌పై ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారేడుపల్లి పీఎస్‌ పరిధిలో ఎస్సై వినయ్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఎస్సై ఆపాడు. వారిని ప్రశ్నిస్తుండగా.. ఒకడు తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఎస్సై కడుపులో పొడిచాడు. ఆ తర్వాత ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్సైని సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల క్రితం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దొంగల పట్టుకునేందుకు మఫ్టీలో ఉన్న సీసీఎస్‌ హెడ్ కానిస్టేబుల్‌ యాదయ్య, గిరిపై దుండగులు కత్తిలో దాడిచేశారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్‌ యాదయ్య తీవ్రంగా గాయడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story