మియాపూర్ లో అదృశ్యమైన బాలిక మృతి వెనుక విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

By Medi Samrat  Published on  18 Nov 2024 7:45 PM IST
మియాపూర్ లో అదృశ్యమైన బాలిక మృతి వెనుక విస్తుపోయే నిజాలు

హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పీఎస్ పరిధిలోని అంజయ్య నగర్‌కి చెందిన బాలిక(17) ఈ నెల 10న అదృశ్యమైంది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. ఆమె ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆ బాలిక శవమై కనిపించింది. సోమవారం నాడు బాలిక మృతదేహాన్ని తుక్కుగూడలోని ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉప్పుగూడకు చెందిన విగ్నేష్ అనే యువకుడు ఆమెను హత్య చేశాడని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి విగ్నేష్‌తో పెళ్లి మైనర్ బాలిక పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ఇంకో యువకుడితో మాట్లాడుతుంటే చూసి కోపంలో విగ్నేష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. విగ్నేష్, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరిన్ని వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.

Next Story