స్నేహితుడు క‌దా అని ఆశ్ర‌య‌మిస్తే.. భార్య‌పై క‌న్నేశాడు

She Teams arrested block mailer.మిత్రుడు క‌ష్టాల్లో ఉన్నాడు అని తెలిసి ఆశ్ర‌యమిస్తే వ‌క్ర బుద్ధి చూపించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2022 7:50 PM IST
స్నేహితుడు క‌దా అని ఆశ్ర‌య‌మిస్తే.. భార్య‌పై క‌న్నేశాడు

మిత్రుడు క‌ష్టాల్లో ఉన్నాడు అని తెలిసి ఆశ్ర‌యమిస్తే వ‌క్ర బుద్ధి చూపించాడు. ఆశ్ర‌య‌మిచ్చిన స్నేహితుడి భార్య‌పైనే క‌న్నేశాడు. దంప‌తులు ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో వీడియోలు తీశాడు. మిత్రుడి భార్య‌ను బెదిరించి త‌న కోరిక తీర్చుకోవాల‌ని అనుకున్న యువ‌కుడిని హైద‌రాబాద్ షీ బృందం పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద‌రాబాద్‌కు చెందిన అబ్దుల్‌ సల్మాన్‌ (23) తన మిత్రుడైన మ‌రో యువకుడి ఇంట్లో కొంతకాలంగా ఉంటున్నాడు. ఆశ్ర‌య‌మిచ్చిన స్నేహితుడి భ‌ర్య‌పైనే క‌న్నేశాడు స‌ల్మాన్‌. దంప‌తులు ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో వీడియో తీశాడు. వాటిని మిత్రుడి భార్యకు చూపించి త‌న కోరిక తీర్చ‌మ‌ని అడిగాడు. లేదంటే ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తాన‌ని బెదిరించ‌సాగాడు. బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్ర‌యించింది. ఆమె ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Next Story