మైనర్ కూతురిపై అత్యాచారం.. హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తి అరెస్టు

Sexual assault on minor daughter, HIV positive person arrested. గత వారం తన 14 ఏళ్ల సవతి భార్య కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ 45 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు

By అంజి  Published on  11 Feb 2022 10:11 AM IST
మైనర్ కూతురిపై అత్యాచారం.. హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తి అరెస్టు

గత వారం తన 14 ఏళ్ల సవతి భార్య కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ 45 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు ఫిబ్రవరి 7, సోమవారం అరెస్టు చేశారు. సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్ సమీపంలోని తమ గుడిసెలో నిందితుడు తన సవతి భార్య కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పోలీసు నివేదికల ప్రకారం, నిందితుడు (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) హెచ్‌ఐవి బారిన పడ్డాడు. అతని కారణంగా మైనర్‌కు కూడా హెచ్‌ఐవి సోకిందా అని పోలీసులు వైద్యులచే పరీక్షలు చేయిన్నారు. ఆమె తల్లి లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం.. బాధితురాలి తల్లి కూడా హెచ్ఐవి పాజిటివ్.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు మైనర్‌ను బెదిరించారు. బాలిక తన పొరుగున ఉన్న ఓ మహిళతో తనకు ఎదురైన కష్టాలను వివరించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత మహిళ ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది. భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012లోని సంబంధిత సెక్షన్ల కింద ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడి ఇంటికి ఒక బృందాన్ని పంపామని, కేసు నమోదు చేసిన అదే రోజు రాత్రి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శిశు సంక్షేమ కమిటీకి చెందిన నిపుణుల బృందం బాలికకు కౌన్సెలింగ్ చేస్తుంది. మైనర్‌పై గతంలో ఒక్కసారే లేదా పలుమార్లు అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story