కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం

Sexual assault on a young woman by threatening lovers in Krishna district. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్ హార్బర్‌ చూ

By అంజి  Published on  11 March 2022 7:39 AM IST
కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం

కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్ హార్బర్‌ చూసేందుకు వెళ్లిన ఓ ప్రేమజంట వెళ్లగా.. ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి, యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. తన ప్రియుడితో కలిసి ఫిషింగ్‌ హార్బర్‌ చూసేందుకు విద్యార్థిని బీచ్‌కి వెళ్లింది. ఇరువురు ముచ్చటలు ఆడుకుంటుండగా వారి వద్దకు ఇద్దరు మందుబాబులు వెళ్లారు.

ఆ తర్వాత ప్రియుడిని తాళ్లతో ఓ మందుబాబు చెట్టుకు కట్టేయగా.. విద్యార్థినిపై బలవంతంగా మరో మందుబాబు లైంగిక దాడి చేశాడు. జరిగిన దాడిని ఎవరికీ చెప్పుకోలేక ప్రేమికులు మిన్నకుండిపోయారు. అయితే మదన పడిపోతున్న విద్యార్థిని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకుని బందర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. లైంగిక దాడికి పాల్పడిన నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story