మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. ప్రలోభపెట్టి అడవికి తీసుకెళ్లి..

Sexual assault on a minor girl in Ghaziabad. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు

By అంజి  Published on  1 March 2022 10:12 AM GMT
మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం.. ప్రలోభపెట్టి అడవికి తీసుకెళ్లి..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు నలుగురు యువకులు. ఈ ఘటన మురాద్‌నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. సోమవారం నాడు తాము బయటికి పని కోసం వెళ్లినప్పుడు తమ 15 ఏళ్ల కూతురు ఇంట్లో ఒంటరిగా ఉందని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కాలనీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న యువకుడు కుమార్తెను ప్రలోభపెట్టి తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన మరో నలుగురి స్నేహితులను అక్కడికి పిలిపించాడు.

ఆ తర్వాత అందరూ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా తమ కూతురు ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బాలికను తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత నిందితులు ఆమెను గుల్లు షా పీర్ దగ్గర పడేసి.. నిందతులు అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో విషయం పోలీసులకు చేరింది. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఒకరి పేరు, నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి కోసం వెతుకుతున్నారు.

Next Story
Share it