కదులుతున్న రైలులో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, వ్యక్తి అరెస్ట్‌

Sexual assault on a 21-year-old woman on a moving train. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం ఇటార్సీ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు

By అంజి  Published on  13 Feb 2022 2:36 AM GMT
కదులుతున్న రైలులో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం, వ్యక్తి అరెస్ట్‌

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం ఇటార్సీ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు ప్యాంట్రీలో 21 ఏళ్ల మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. రైల్ అడిషనల్ ఎస్పీ ప్రతిమ ఎస్ మాథ్యూ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ కర్ణాటక సంపర్క్ క్రాంతి ఏసీ కోచ్‌లో భుసావల్ నుంచి ఢిల్లీకి వెళుతోంది. టికెట్‌ లేకపోవడంతో టాయిలెట్‌ దగ్గర నేలపై నిద్రపోయింది.

ఉచితంగా సీటు ఇప్పిస్తానన్న సాకుతో సదరు వ్యక్తి మహిళను ప్యాంట్రీలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత, మహిళ సంఘటన గురించి ప్రయాణీకులకు తెలియజేయగా, అక్కడి నుండి జీఆర్‌పీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది. రైలు భోపాల్‌కు చేరుకోగానే, ప్యాంట్రీ కారులోని సిబ్బంది అందరినీ జీఆర్పీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైలులో దాక్కున్న అనుమానిత నిందితుడిని ఝాన్సీ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నట్లు ప్రతిమ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని అదనపు ఎస్పీ తెలిపారు.

Next Story
Share it