చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురు మృతి

Seven TDP worker died in Chandrababu Kandukuru Meeting. నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.

By Medi Samrat
Published on : 28 Dec 2022 3:47 PM

చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురు మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు ఇదేం ఖర్మ సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. స‌భాస్థ‌లి వ‌ద్ద‌ కార్యకర్తల తోపులాటలో కొంద‌రు అదుపుత‌ప్పి డ్రైనేజీలో జారిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతిచెందగా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్రచార వాహనంపై చంద్రబాబు ఉండగా తోపులాట జ‌రిగింది. వెంట‌నే చంద్ర‌బాబు ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేస్తూ.. ప్రసంగాన్ని ఆపేసి హుటాహుటిన ఆసుప‌త్రికి వెళ్లి గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. తొక్కిసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని విచారం వ్య‌క్తం చేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 10 లక్షల ప‌రిహారం ప్ర‌క‌టించారు. కార్య‌క‌ర్త‌ల‌ పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.



Next Story