పిల‌వ‌ని పెళ్లికి వెళ్లాడు.. క్ష‌ణాల్లో డ‌బ్బు బ్యాగ్‌తో మాయ‌మ‌య్యాడు..!

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దొంగల ముఠాలు యాక్టివ్‌గా మారాయి. రాజస్థాన్‌లోని బలోత్రాలో వివాహ వేడుక నుంచి ఏడు లక్షల‌ రూపాయల బ్యాగ్ మాయమైంది

By Kalasani Durgapraveen  Published on  15 Nov 2024 4:45 PM IST
పిల‌వ‌ని పెళ్లికి వెళ్లాడు.. క్ష‌ణాల్లో డ‌బ్బు బ్యాగ్‌తో మాయ‌మ‌య్యాడు..!

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. దొంగల ముఠాలు యాక్టివ్‌గా మారాయి. రాజస్థాన్‌లోని బలోత్రాలో వివాహ వేడుక నుంచి ఏడు లక్షల‌ రూపాయల బ్యాగ్ మాయమైంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఓ రిసార్ట్‌లో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. బలోత్రాలోని నకోడా రోడ్‌లో ఉన్న రిసార్ట్‌లో నవంబర్ 14న అంటే గురువారం సాయంత్రం వివాహ వేడుకను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఫంక్షన్‌కు చేరుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులు కొద్ది నిమిషాల్లోనే డ‌బ్బు కొట్టేసి ప‌రార‌య్యారు. నిందితుల కోసం జాసోల్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

NDTV కథనం ప్రకారం.. జోధ్‌పూర్‌లోని షేర్‌ఘర్‌లో నివసిస్తున్న కమల్ కిషోర్ తవారి మేనల్లుడి వివాహం జ‌రుగుతంది. నకోడా రోడ్డులోని ఓ రిసార్ట్‌లో బస చేశారు. వధూవరులకు స్వాగతం పలికే కార్యక్రమం జ‌రుగుతుంది. కమల్ కిషోర్ వేదికపైకి డబ్బుతో కూడిన బ్యాగ్‌తో పూజకు హాజరు అయ్యేందుకు వ‌స్తున్నాడు. అంతలోనే ఒక యువకుడు అక్కడికి చేరుకుని నెమ్మదిగా వేదికపై కూర్చున్నాడు. దగ్గరలో చాలా మంది మహిళలు నిలబడి ఉన్నారు. కానీ ఆ అజ్ఞాత యువకుడిని ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికే ఆ యువకుడు డబ్బుతో కూడిన బ్యాగ్‌తో పారిపోయాడు.

సంఘటన జరిగిన కొంత సమయం తరువాత బ్యాగ్ దొంగిలించబడిందని గుర్తించి వరుడి కుటుంబీకులు షాక్‌కు గురవుతారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే చోరీ ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు ఒక వ్యక్తితో కలిసి కారులో రిసార్ట్ వెలుపల పారిపోతున్న దృశ్యం కూడా సీసీ కెమెరాల‌లో రికార్డైంది.

Next Story