అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ.. పట్టుబడ్డ ఐదుగురు తెలుగువారు
అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ తెలుగు యువకులు పట్టుబడ్డారు. తెలుగు యువకులు వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది.
By అంజి Published on 22 Aug 2024 8:00 AM GMTఅమెరికాలో వ్యభిచారం చేయిస్తూ.. పట్టుబడ్డ ఐదుగురు తెలుగువారు
అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ తెలుగు యువకులు పట్టుబడ్డారు. తెలుగు యువకులు వ్యభిచారం కేసుల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. టెక్సాస్‌లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు. అందులో ఐదుగురు తెలుగువారు ఉన్నారు. రెండు రోజుల క్రితం డెంటన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లలో మొత్తం 18 మంది పట్టుబడ్డగా అందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా గుర్తించారు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి బాగా చదువు కొని అక్కడే ఉద్యోగం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ అక్కడికి వెళ్లిన యువకులు వ్యభి చారం ముఠాలో సభ్యులుగా ఉండి. గలీజ్ దందా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. మొత్తం 18 మందిని డెంటాన్ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 మంది వ్యభిచారం కేసులో పట్టుపడగా.. ఇద్దరు 18 ఏళ్లలోపు వారిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ బండి, నిఖిల్ కుమ్మరిలపై అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని అభియోగం మోపగా.. మోనిష్ గల్లా, కార్తీక్ రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం అభ్యర్థించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డెంటన్ కౌంటీలో వ్యభిచారాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన స్టింగ్ ఆపరేషన్ లో నార్త్ టెక్సాస్‌కు చెందిన 18 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు గత మంగళవారం టెక్సాస్ షెరీఫ్ కార్యాలయం వార్తా ప్రకటన విడుదల తెలిపింది.