జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లేడీ ఎస్సై సహా ఇద్దరు మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on  4 Feb 2025 11:57 AM IST
road accident, Jagitya, Two died ,Lady SI , Crime

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. లేడీ ఎస్సై సహా ఇద్దరు మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అత్యంత వేగంగా వెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. అనంతరం కారు అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్ క్వార్టర్స్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయలై అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహన దారుడు కూడా మృతి చెందాడు. ఆమె అకాల మరణంతో పోలీస్ శాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్వేత మృతిపట్ల సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ ని లారీ అత్యంత వేగంగా వచ్చే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story