హైదరాబాద్: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫామ్ హౌస్ పార్టీలో కొకైన్, MDMA, మెధోయిటపిన్ అనే మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నమిత శర్మ ఈ మూడు రకాల డ్రగ్స్‌ను ఉపయోగించగా, పైలట్ రోహిత్ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిద్దరూ అధిక కిక్కు కోసం ఖరీదైన మద్యంతో పాటు ఈ డ్రగ్స్‌ను కలిపి తీసుకున్నట్లు విచారణలో తేలింది.
అర్జున్ రెడ్డితో పాటు మిగతా వారు కూడా MDMA మరియు మెధోయిటపిన్ వాడినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి కౌశిక్ అనే వ్యక్తి సిమ్లా నుండి కొకైన్‌ను తీసుకురాగా, అభిషేక్ అనే వ్యక్తి నుండి పైలట్ డ్రైవర్ శరత్ రెండు రకాల డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రమాదకరమైన రీతిలో డ్రగ్స్ కాంబినేషన్లను వాడటం ఇప్పుడు ఈ కేసులో సంచలనంగా మారింది.