ఘోరం.. 16 ఏళ్ల బాలికను హతమార్చి.. మృతదేహాంపై సామూహిక అత్యాచారం
Sensational things in Bundi Girl post mortem report.మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 12:37 PM ISTమహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సభ్యసమాజం తలదించుకునే, ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి యత్నించి.. హతమార్చడమే కాకుండా.. మృతదేహాన్ని సైతం వదిలిపెట్టలేదు. మృతదేహాంతో కూడా తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుండి పట్టణంలో ఓ 16ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. డిసెంబర్ 23, 2021న పట్టణ శివారులోని పొలాల్లో మేకలను మేపేందుకు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. బాలిక ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టిన క్రమంలో బాలిక మృతదేహాం పొలాల్లో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.
ముగ్గురు యువకులు బాలికను అపహరించి అత్యాచారయత్నం చేశారు. బాలిక ప్రతిఘటించడంతో.. ఆమెను గొంతు నులిమి చంపేశారు. బాలిక మరణించిన అనంతరం బాలిక మృతదేహాన్ని వదలలేదు. మృతదేహాంపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోస్టుమార్టం రిపోర్టులో బాలిక ప్రైవేటు బాగాల్లో 30కి పైగా గాయాలుయని తెలిసింది. బాలిక ఒంటి నిండా గోర్లతో రక్కినట్లుగా గీతలు ఉన్నాయి. అత్యాచారం చేయడానికి ముందు దుప్పట్టాతో బాలికను కట్టేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జై యాదవ్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇంత దారుణమైన ఘటనను చూడలేదన్నారు. బుండీ బార్ అసోసియేషన్ సభ్యులు సైతం నిందితుల తరుపున కోర్టులో వాదించబోమని ప్రకటించారని చెప్పారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.