దొంగతనం చేసిన పని మనిషి.. ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు పెట్టి

దొంగిలించిన ఆభరణాలను ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పని మనిషి ఇబ్బందుల్లో పడింది. జ్యువెలరీ యజమాని ఫోటోలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అడ్డంగా బుక్ అయింది

By Medi Samrat  Published on  21 Sept 2024 1:49 PM IST
దొంగతనం చేసిన పని మనిషి.. ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు పెట్టి

దొంగిలించిన ఆభరణాలను ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పని మనిషి ఇబ్బందుల్లో పడింది. జ్యువెలరీ యజమాని ఫోటోలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అడ్డంగా బుక్ అయింది. ముంబై లోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. విచారణకు హాజరుకావాలని నిందితురాలికి పోలీసులు నోటీసులు పంపారు.

నిందితురాలిని సంజనా గుజార్‌గా గుర్తించారు. ఖార్ వెస్ట్‌లోని లోక్‌నిర్మాన్ హైట్స్‌లో నందితా ఠక్కర్‌ అనే మహిళా ఇంట్లో పనిమనిషిగా ఉండేది. సంజన పని చేసే ఇంట్లో నుండి సుమారు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించింది. నందితా ఠక్కర్‌ ఇంట్లో జనవరి 12 నుండి జనవరి 21 మధ్య ఆ ఇంట్లో రెగ్యులర్ గా ఉండే పనిమనిషి సెలవులో ఉన్నప్పుడు సంజనా పనులు చేసింది. సాధారణ పనిమనిషి జనవరి 21న తిరిగి రావడంతో సంజనా పనికి రావాల్సిన అవసరం పడలేదు.

అయితే ఫిబ్రవరి 19 న, ఒక కార్యక్రమానికి వెళ్లాలని అనుకున్నప్పుడు అల్మారా నుండి చెవిపోగులతో పాటు ఐదు బంగారు ఆభరణాలు, వజ్రాల ఉంగరం కనిపించకుండా పోయిందని నందితా ఠక్కర్‌ గుర్తించింది. ఇంటిని మొత్తం వెతికినా ఎక్కడా కనిపించలేదు.

ఇతర పనిమనుషులను శకుంతల, సలోనిలను కూడా అడిగారు. ఆ వస్తువుల గురించి ఏమీ తెలియదని చెప్పారు. సంజనాను కూడా సంప్రదించింది నందితా ఠక్కర్‌. తన ప్రమేయం లేదని తెలిపింది. నందితా ఠక్కర్‌ పోలీసులకు సంప్రదించలేదు. ఇక సెప్టెంబర్ 10న, ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు సంజనా గుజార్ పెట్టిన ఫోటోలను చూసింది నందితా. సంజనా చేతికున్న ఉంగరం తన ఇంట్లోదే అని నందితా తెలుసుకుంది. వెంటనే ఖార్ పోలీసులను ఆశ్రయించగా.. సంజనా పై కేసు నమోదు అయింది.

Next Story