టీవీ చూస్తున్నందుకు మందలించిన తల్లి.. ఉరేసుకున్న బాలిక

టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందని 18 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి
Published on : 17 Oct 2023 8:45 AM IST

Crime news, suicide, Uttar Pradesh, Ballia

టీవీ చూస్తున్నందుకు మందలించిన తల్లి.. ఉరేసుకున్న బాలిక

టీవీ చూస్తున్నందుకు తల్లి మందలించిందని 18 ఏళ్ల 12వ తరగతి విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. తల్లి మాటలతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మనీషా ఓ గది తలుపును లోపలి నుంచి మూసివేసి దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజాము వరకు తలుపులు తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తలుపులను బద్దలుకొట్టి చూడగా బాలిక ఉరివేసుకుని కనిపించిందని ఉభాన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎంకే శ్రీవాస్తవ తెలిపారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు శ్రీవాస్తవ తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులకు సూసైడ్ నోట్ లభించిందని, అందులో తల్లి మందలించడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, మనీషా ఆదివారం అర్థరాత్రి టీవీ సీరియల్ చూస్తోందని, అందుకు ఆమె తల్లి ఆమెను మందలించిందని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు.

Next Story