స్కూల్ మానేసిందని తల్లి మందలింపు.. రైలు కింద దూకి బాలిక ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ టీనేజ్ బాలిక స్కూల్‌కు వెళ్లడం మానేసినందుకు తల్లి మందలించడంతో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

By అంజి  Published on  8 Dec 2023 10:00 AM IST
school, UP girl, train, Crime news

స్కూల్ మానేసిందని తల్లి మందలింపు.. రైలు కింద దూకి బాలిక ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ టీనేజ్ బాలిక స్కూల్‌కు వెళ్లడం మానేసినందుకు తల్లి మందలించడంతో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల ఖుషీ శర్మ బుధవారం పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన ఆమె తల్లి తన కూతురిని పాఠశాలకు వెళ్లనని పట్టుబట్టడంతో మందలించి చెంపదెబ్బ కొట్టింది.

అయితే రణ్‌వీర్ శర్మ కూతురు ఖుషీ మాత్రం పాఠశాలకు వెళ్లకుండా అల్వార్-మథుర రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు ముందు దూకింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఖుషీ తండ్రి రామ్‌వీర్ మాట్లాడుతూ.. ఆమె సోదరుడు 12వ తరగతి చదువుతుండగా, చెల్లెలు 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి పదే పదే తిట్టడంతో బాలిక మనస్తాపానికి గురైందని భావిస్తున్నారు.

Next Story