Hyderabad: లాడ్జిలో శవమై కనిపించిన స్కూల్ టీచర్

నగరంలోని మియాపూర్‌లోని ఓ లాడ్జిలో ఆదివారం ఓ పాఠశాల ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.

By అంజి
Published on : 26 May 2024 9:07 PM IST

Hyderabad , School teacher, lodge , Miyapur, Crime

Hyderabad: లాడ్జిలో శవమై కనిపించిన స్కూల్ టీచర్  

హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లోని ఓ లాడ్జిలో ఆదివారం ఓ పాఠశాల ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జయప్రకాశ్‌ నారాయణ తుల్లే (30) రెండు రోజుల క్రితం తన స్వగ్రామం నుంచి కూకట్‌పల్లికి తన సోదరిని కలిసేందుకు వచ్చాడు. శనివారం మధ్యాహ్నం తన సోదరి ఇంటి నుంచి బయలుదేరి మియాపూర్‌లోని లాడ్జిలోకి దిగాడు.

“ఆదివారం మధ్యాహ్నం, అతను లాడ్జిలో శవమై కనిపించాడు. అతను ఏదైనా విషపూరితమైన పదార్థాన్ని సేవించి తన జీవితాన్ని ముగించుకుని ఉంటాడని మేము అనుమానిస్తున్నాము” అని మియాపూర్ ఇన్‌స్పెక్టర్ వి దుర్గా రామ లింగ ప్రసాద్ అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి జయప్రకాశ్​ ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యలు శనివారం రాత్రి కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

Next Story