రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోము ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో చక్రాల కింద నలిగి ఒక బాలిక మరణించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడున్న వారిని తీవ్రంగా కలిచి వేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు, సంఘటన జరిగిన సమయంలో దాదాపు 40 మంది విద్యార్థులతో ఉంది.
బస్సు బోల్తా పడిన ఘటనలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రత్యక్ష సాక్షి ప్రకారం.. "బస్సు గంటకు 60-70 కి.మీ వేగంతో ఉంది. నేను అక్కడికి చేరుకునేసరికి గాజు పగలగొట్టి 30-40 మంది బాలికలను బయటకు తీశాను, కానీ ఒక బాలిక బస్సు కింద చిక్కుకుంది. బస్సులో దాదాపు 40-50 మంది విద్యార్థులు ఉన్నారు." ఈ సంఘటన తర్వాత స్థానికులు సంఘటన స్థలంలో గుమిగూడి నిరసన తెలిపారు.