సబ్బు కోసం వెళ్లిన.. 8 ఏళ్ల బాలికపై సర్పంచ్‌ భర్త అత్యాచారం

Sarpanch's husband rapes a minor girl in Jharkhand. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గురువారం నాడు ఎనిమిదేళ్ల బాలికపై గ్రామ సర్పంచ్‌

By అంజి  Published on  13 Aug 2022 9:53 AM IST
సబ్బు కోసం వెళ్లిన.. 8 ఏళ్ల బాలికపై సర్పంచ్‌ భర్త అత్యాచారం

జార్ఖండ్‌లోని గిరిదిహ్‌ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గురువారం నాడు ఎనిమిదేళ్ల బాలికపై గ్రామ సర్పంచ్‌ భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని సర్పంచ్‌ భర్త మింకు మండలం (35)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌ బాలిక తన తల్లితో కలిసి గ్రామ శివారులో ఉన్న నదిలో స్నానం చేసేందుకు వెళ్లింది. అదే సమయంలో మహిళా సర్పంచ్‌ కంచన్‌ దేవి కూడా స్నానం చేసేందుకు నది వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే మహిళా సర్పంచ్‌.. మైనర్‌ బాలికను తమ ఇంటికి వెళ్లి తీసుకురావాలని కోరింది.

బాలిక సబ్బు కోసం సర్పంచ్‌ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలోనే బాలికపై సర్పంచ్‌ భర్త మింకు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం ఎలాగోలా నది వద్దకు చేరుకున్న బాలిక విషయం తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి బిర్ని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గిరిది సదర్ ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ధన్‌బాద్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం మూడు వేరు వేరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని బాగోదర్‌ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి నౌషాద్‌ ఆలం తెలిపారు.

Next Story