కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

By అంజి  Published on  26 Feb 2024 8:47 AM IST
RTC bus,  Kakinada,  road accident, APnews

కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం

కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైర్ పంక్చర్‌ అయ్యింది. దీంతో రహదారి పక్కనే లారీని నిలిపివేసి మరమ్మతులు చేస్తున్న సమయంలో నలుగురిపైకి సూపర్ లగ్జీ బస్సు దూసుకెళ్లింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్‌ ముందుకు తీసుకెళ్లాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బస్సును వెంబడించి పట్టుకున్నారు. మరణించిన వారిని దాసరి ప్రసాద్, కిషోర్, నాగయ్య, రాజుగా గుర్తించారు. మృతులది నక్కబొక్కలపాడు. ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను పోలీసులు సేకరించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story