తిరుప‌తిలో ఆర్టీసీ బ‌స్సు భీభ‌త్సం.. జ‌నంపైకి దూసుకెళ్లింది

RTC Bus accident in tirupati.ఓ ఆర్టీసీ బ‌స్సు తిరుప‌తిలో భీభ‌త్సం సృష్టించింది. వేగంగా వ‌చ్చిన బ‌స్సు అదుపు త‌ప్పి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 9:27 AM IST
Rtc bus accident

ఓ ఆర్టీసీ బ‌స్సు తిరుప‌తిలో భీభ‌త్సం సృష్టించింది. వేగంగా వ‌చ్చిన బ‌స్సు అదుపు త‌ప్పి ఒక్క‌సారిగా జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. తిరుప‌తిలోని సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బ‌స్సు రైల్వే స్టేష‌న్ నుంచి తిరుమ‌ల‌కు వెలుతోంది. క‌ర్నా వీధి ద‌గ్గ‌రకు వ‌చ్చేస‌రికి బ‌స్సు అదుపు త‌ప్పింది. దీంతో జ‌నంపైకి దూసుకెళ్లింది. బస్సు విధ్వంసం అంతటితో ఆగలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టడంతో బస్సు ఆగింది. అంతేకాక బస్సు బీభత్సానికి నాలుగు ద్విచక్ర వాహనాలు కూడా తుక్కుతుక్కయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌లో ఓ మహిళా అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూమృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులతో పాటు బస్సులో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్ట వ‌శాత్తు బస్సులో ఉన్న వారికి ఏమీ కాలేదు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్పందించిన స్థానికులు గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు, అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణమ‌ని పోలీసులు బావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న త‌రువాత డ్రైవ‌ర్ అక్క‌డ నుంచి ప‌రార‌య్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.




Next Story