వెండి కడియాల కోసం.. మహిళ కాళ్లు నరికి చంపిన దొంగ

Robber chops off woman's feet to steal silver anklets in Rajasthan. రాజస్థాన్‌ రాష్ట్రంలోని చార్‌భుజా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లను దొంగ నరికి చంపాడు.

By అంజి  Published on  17 Nov 2021 12:29 PM IST
వెండి కడియాల కోసం.. మహిళ కాళ్లు నరికి చంపిన దొంగ

రాజస్థాన్‌ రాష్ట్రంలోని చార్‌భుజా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లను దొంగ నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌సమంద్‌ జిల్లా చార్‌భుజా పీఎస్‌ పరిధిలోని ఓ పొలంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మహిళ వయస్సు 45 ఏళ్లు ఉంటుందని, ఆమె నరికివేసిన కాళ్లతో అక్కడ పడి ఉందని పోలీసులు తెలిపారు. మహిళ కాళ్లకు ఉన్న వెండి కడియాలను చోరీ చేసేందుకే దొంగ ఆమె పాదాలను నరికి చంపాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత మహిళ మెడపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలం దగ్గర పని చేస్తున్న తన భర్త మహిళ కంకుబాయి ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్తుండగా ఈ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు.

పొలం వద్దకు భార్య రాకపోవడంతో.. భర్త ఇంటికి చేరుకున్నాడు. తల్లి ఎటు పోయిందని తన పిల్లలను అడగగా.. పొద్దున్నే భోజనం తీసుకుని పోలానికి వెళ్లిందని చెప్పారు. దీంతో కంకుబాయి భర్త, బంధువులు, స్థానికులు ఆమె కోసం వెతికారు. రాత్రి వరకు వెతికినా ఆమె ఆచూకీ కనబడకపోవడంతో చరభుజా పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని రాజ్‌సమంద్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ శివలాల్‌ తెలిపారు. పాదాలు నరికిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడం ఇదే తొలిసారి కాదు. జైపూర్‌లో కొద్ది రోజుల క్రితం పొలంలో పశువులు మేపేందుకు వెళ్లిన ఓ మహిళ శవమై కనిపించింది. ఆమె పాదాలు కూడా తెగిపోయాయి. ఆమె వెండి కడియాలు కూడా కనిపించలేదు.

Next Story