హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఓ ఇద్దరి యువకులు బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఒక కారు అత్యంత వేగంగా వస్తూ కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చి బైకును ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఇద్దరు యువకులు కుషాయిగూడ మల్యాల గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ భయపడిపోయి కారును అక్కడే వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని కారు డ్రైవర్ను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.