యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారు జామున భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగూడెం నుంచి పోచంపల్లి వైపు నేషనల్ హైవేపై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చెరువులోకి దూసుకెళ్లిన కారును స్థానికులు బయటకు తీశారు. అప్పటికే అందులోని ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అతివేగంతోపాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు