ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాఠశాల బస్సు.. ముగ్గురు చిన్నారులు మృతి
Road Accident in Vizianagaram District three childerns dead.విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు
By తోట వంశీ కుమార్ Published on
15 March 2022 2:41 PM GMT

విజయనగరం జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం జిల్లా తెర్లాం మండలం పరిధిలోని టెక్కలి వలస వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా.. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని.. వారంతగా గ్రామంలో జాతరకు వెలుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని రాజాం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను సిద్ధూ, హర్ష, రుషిగా గుర్తించారు. వీరంతా 9 ఏళ్ల వయస్సు లోపు వారు కావడం గమనార్హం.
Next Story