విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Road Accident in Visakhapatnam two dead.విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తగరపువలస జాతీయ
By తోట వంశీ కుమార్ Published on
9 Feb 2022 5:10 AM GMT

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తగరపువలస జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story