దైవదర్శనానికి వెళ్తి తిరిగివస్తుండగా ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

By Knakam Karthik
Published on : 27 April 2025 4:47 PM IST

Crime News, Telangana, Vikarabad, Kodangal

దైవదర్శనానికి వెళ్తి తిరిగివస్తుండగా ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్

రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శనానంతరం తిరిగి వస్తుండగా.. చిట్లపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కొండగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story