విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Road accident in Vijayawada.విజ‌య‌వాడ న‌గ‌ర శివారులో శ‌నివారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sep 2021 3:52 AM GMT
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

విజ‌య‌వాడ న‌గ‌ర శివారులో శ‌నివారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెలుతున్న ముగ్గురు యువ‌కులు మృత్యువాత ప‌డ్డారు. కండ్రిక పాతపాడు వ‌ద్ద రోడ్డు నిర్మాణ పనులకు ఏర్పాటు చేసిన జాకీలను ప్ర‌మాద‌వ‌శాత్తు ద్విచ‌క్ర‌వాహ‌నం ఢీకొట్టింది. దీంతో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా.. మ‌రొ యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో మృతి చెందాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను వాంబే కాల‌నీకి చెందిన రాజు, ర‌మ‌ణ‌, సింహాచ‌లం గా గుర్తించారు. రహదారి డైవర్షన్ చూసుకోకుండా బైక్‌ను అతి వేగంతో నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువ‌కుల మృతి నేప‌థ్యంలో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది.

Next Story
Share it