తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం

Road Accident In Tamilnadu. తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు

By Medi Samrat  Published on  12 Dec 2020 6:07 PM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం

తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వేలూరు జిల్లా ఆనకట్టు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రా నుంచి తమిళనాడుకు రాతి బండల లోడ్‌తో వెళుతున్న మినీ లారీ అదుపు తప్పి దూసుకువెళ్లడంతో వీ కోటకు చెందిన కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్ర‌మాదంలో వీ కోట‌కు చెందిన కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు గోవిందప్ప, రాముడు, వరదప్పగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.


Next Story