ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద కారు, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆటోలో ఉన్నవారు మిర్చి కోతకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని స్థానికులు అంటున్నారు.