ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి, ఐదుగురికి గాయాలు

Road Accident in Peddapalli district Two dead.ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2022 6:30 AM GMT
ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ఇద్ద‌రు మృతి, ఐదుగురికి గాయాలు

ఆగి ఉన్న డీసీఎంను స్కార్పియో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం చెంద‌గా.. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న పెద్దప‌ల్లి జిల్లా పెద్ద కాల్వ‌ల రాజీవ్ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఏడుగురు వ్య‌క్తులు స్కార్పియో వాహ‌నంలో ఆదివారం హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా పెద్దప‌ల్లి జిల్లా పెద్ద కాల్వ‌ల రాజీవ్ ర‌హ‌దారిపై వీరు ప్ర‌యాణీస్తున్న‌వాహ‌నం ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు మృతిచెంద‌గా.. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతుల‌ను చైత్ర‌ముఖి(25), పులా రామ్‌(40) గా, వీరంతా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిద్ర మ‌త్తే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు బావిస్తున్నారు.

Next Story
Share it